రామ్మోహన్ నాయుడు ఏ విధంగా చూసినా లోకేశ్ బాబుకు సమవుజ్జీనే!: విజయసాయిరెడ్డి వ్యంగ్యం

  • టీడీపీ అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు అంటూ ప్రచారం
  • పార్టీకి కావాల్సింది ఇలాంటివారేనంటూ విజయసాయి ఎద్దేవా
  • కొన్ని వ్యాఖ్యలతో రామ్మోహన్ అజ్ఞానం బయటపడిందని వెల్లడి
టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్న తనపై చేసిన ట్వీట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తక్కువ మాట్లాడడం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుందని, అజ్ఞానం బయటపడదని తెలిపారు.

రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లపాటు అలాగే మౌనంగా ఉంటే బాగుండేదని, కానీ కొన్ని వ్యాఖ్యలతో తనను తాను బయటపెట్టుకున్నాడని వివరించారు. రామ్మోహన్ నాయుడు ఏ రకంగా చూసినా లోకేశ్ బాబుకు సమవుజ్జీనే అన్న విషయం ఇప్పుడర్థమవుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఇప్పుడా పార్టీకి కావాల్సింది ఇలాంటి వారేనంటూ ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy
Kinjarapu Ram Mohan Naidu
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh

More Telugu News